: భారత్ రోడ్లపై 'హోండా' దూకుడు


ఆటోమొబైల్ దిగ్గజం హోండా భారత రోడ్లపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత్ లో కార్ల ఉత్పత్తికి వచ్చే ఏడాది లోపు రూ. 2600 కోట్ల మేర నిధులు కేటాయించాలని ఈ జపాన్ కంపెనీ వ్యూహ రచన చేస్తోంది. తద్వారా ఏటా 1,20,000 కార్లను అసెంబుల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కాగా, రాజస్థాన్ లో నెలకొల్పిన హోండా కార్ల కర్మాగారం ద్వారా తొలి కారును వచ్చే ఏడాది మార్కెట్లో ప్రవేశపెట్టనున్నామని సంస్థ మేనేజింగ్ ఆఫీసర్ యోషుయుకి మత్సుమొటో తెలిపారు. జాజ్, బ్రియో మోడల్స్ తో వినియోగదారుల మన్ననలందుకున్న హోండా ఈ ఆర్ధిక సంవత్సరంలో 45 శాతం వృద్ధిని కనబర్చడం విశేషం. 

  • Loading...

More Telugu News