: ఈసీపై బీజేపీ తీరుని ఖండించిన సీతారాం ఏచూరి
వారణాసిలో ఎన్నికల ర్యాలీ నిర్వహించుకునేందుకు నరేంద్రమోడీకి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై మండిపడుతున్న బీజేపీ అక్కడ ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. దాన్ని సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి ఖండించారు. ఈసీని గర్హించే తీరు ఇది కాదని సూచించారు. వారితో విభేదాలు ఉంటే చర్చించుకోవాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని చెప్పారు. ఎన్నికల సంఘం పనితీరుపై తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఏచూరి తెలిపారు.