: ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది: చిదంబరం


దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ఆహార వస్తువుల ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరుగుతోందన్నారు. ఆర్బీఐ తదుపరి విధాన రేట్ల సమీక్షలో ద్రవ్యోల్బణం, అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఓడిపోతామన్న నైరాశ్యంతోనే బీజేపీ వారణాసిలో ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిందని చిదంబరం అన్నారు. ఎన్నికల సంఘం బలహీనమైందన్న వాదనతో ఏకభవించనని ఆయన చెప్పారు. మొత్తం మీద ఈసీ పనితీరు బాగుందని ఆయన కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News