: కేవీపీతో టీఆర్ఎస్ కు సంబంధాలున్నాయి: మధుయాష్కీ


రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేవీపీతో టీఆర్ఎస్ కు మంచి సంబంధాలే ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేవీపీతో బాటు, కొందరు రాష్ట్ర మంత్రులు జగన్ కి కోవర్టులుగా పనిచేస్తున్నారని యాష్కీ ఆరోపించారు. వైఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన కేవీపీని జైల్లో పెట్టి, విచారిస్తేనే జగన్ అక్రమాలన్నీబయటకు వస్తాయన్నారు.

హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. 2014 ఎన్నికలకు ముందే తెలంగాణ సాధించుకోవాలని సూచించారు. అయితే శీతాకాల సమావేశాల్లోపే తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News