: మైఖేల్ జాక్సన్ పిల్లలకు 48 కోట్లు మంజూరు
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ పిల్లలకు సంవత్సర ఆదాయం కింద స్థానిక కోర్టు ఎనిమిది మిలియన్ డాలర్ల (రూ.48 కోట్లు)ను ఈ రోజు మంజూరు చేసింది. 2009లో మైఖేల్ చనిపోయే సమయంలో అతనికి పదిహేడేళ్ల ప్రిన్స్, పదహారేళ్ల పారిస్, పన్నెండు సంవత్సరాల బ్లాంకెట్ అనే పిల్లలున్నారు. తండ్రి మరణించాక వారు ముగ్గురూ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో అమ్మమ్మ కాథరిన్ జాక్సన్, బంధువు టీజే జాక్సన్ సంరక్షణలో ఉంటున్నారు. ఇప్పుడు వారి బాగోగులు చూసేందుకు, ఇతర అవసరాల కోసమని న్యాయస్థానం కొంత మొత్తాన్ని ఇస్తున్నట్లు తెలిపింది.