: పాక్ లో బాంబు పేలుడు... ఎనిమిది మంది మృతి
క్రమం తప్పకుండా బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్న పాకిస్థాన్ లో ఈ రోజు మరో బాంబు పేలుడు సంభవించింది. దక్షిణ వజీరిస్థాన్ లోని సెక్యూరిటీ ఫోర్సు హెడ్ క్వార్టర్స్ సమీపంలో ఈ ఘటన సంభవించింది. పేలుడులో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుడుకు తీవ్రవాదులే కారణమని భావిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా పేలుడుకు పాల్పడ్డారని డాన్ పత్రిక వెల్లడించింది.