: భద్రకాళీ ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
వరంగల్ లోని చారిత్రక భద్రకాళీ దేవస్థానంలో అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారికి చందనోత్సవం నిర్వహించారు. మంచిగంధంతో ఉన్న భద్రకాళీదేవిని దర్శిస్తే ఎలాంటి వ్యాధులు దరిచేరవని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు.