: ఐపీఎల్ వచ్చింది.. 'కింగ్ ఫిషర్' ఉద్యోగులకు జీతం తెచ్చింది


పది నెలల నుంచి జీతాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన కింగ్  ఫిషర్ విమానయాన సంస్థ ఉద్యోగుల ముఖాలు ఎట్టకేలకు వికసించాయి. ఐపీఎల్ ఆరవ సీజన్ ఆరంభం కానున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యా తన ఉద్యోగులకు రెండు నెలల వేతనాన్ని విడుదల చేశారు. విజయ్ మాల్యా ఐపీఎల్ లో ప్రముఖ ఫ్రాంచైజీ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు యజమాని అన్న సంగతి తెలిసిందే.

తాజా సీజన్ లో రాయల్ చాలెంజర్స్ గురువారం ముంబయి ఇండియన్స్ తో సొంతగడ్డపై జరిగే మ్యాచ్ తో పాయింట్ల వేటను ఆరంభించనుంది. కాగా, గత నెలలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇంజినీర్లు తమ వేతనాలు చెల్లించకపోతే చాలెంజర్స్ ఆడే మ్యాచ్ లకు ఆటంకం కలిగిస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా మాల్యా జట్టు నుంచి ఆటగాళ్ళు వైదొలగాలని అర్థించారు కూడా.

ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు నుంచి తప్పుకోవాలంటూ, ఢిల్లీలోని ఆయన నివాసం ఎదుట కొందరు కింగ్ ఫిషర్ ఉద్యోగులు నిన్న నిరసన తెలిపినట్టు సమాచారం.  గత ఏడాది భారత్ లో నిర్వహించిన ఫార్ములా వన్ రేస్ సందర్భంగా తాము నిరసన ప్రదర్శన నిర్వహించామని, అప్పుడు కింగ్ ఫిషర్ యాజమాన్యం ఒక నెల జీతం అందించిందని ఓ ఇంజినీర్ చెప్పారు. 

  • Loading...

More Telugu News