: అపాయింటెడ్ డేపై టీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది: శ్రవణ్
అపాయింటెడ్ డేపై టీఆర్ఎస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్ అన్నారు. హైదరాబాదులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. దళితులు ముఖ్యమంత్రి పదవికి అనర్హులనేలా టీఆర్ఎస్ తీరు ఉందని ఆయన మండిపడ్డారు.
కేసీఆరే సీఎం పదవికి అర్హుడని దళిత నేతలు అంటుంటే నోరెందుకు మెదపడం లేదని మరో నేత అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. దళితులు సీఎం పదవికి సమర్థులు కాదా? అని ఆయన నిలదీశారు.