: ప్రజాసేవ కోసం సినిమాలు తగ్గించుకుంటా: బాలయ్య


ఎన్నికల్లో తన గెలుపుపై టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ధీమాగా ఉన్నారు. ప్రజాసేవ కోసం సినిమాలను తగ్గించుకుంటానని తెలిపారు. అయితే, పూర్తిగా సినిమాలకు దూరం కాబోనని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లాలో ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడారు. హిందూపురంలో తన గెలుపు తథ్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న బాలయ్య... చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News