: గవర్నర్ కు పొన్నాల లేఖ
గవర్నర్ నరసింహన్ కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య లేఖ రాశారు. సచివాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలకు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని పొన్నాల కోరారు. వివిధ శాఖల హెచ్ఓడీల కార్యాలయాలను తెలంగాణకే కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.