: ఆమె ఏడడుగులు...అతను ఐదడుగులు
ప్రేమకు భేదాలు లేవని ఈ బ్రెజిల్ జంట నిరూపించింది. ఏడడుగుల సుందరి ఐదడుగుల వ్యక్తిని పెళ్లాడబోతోంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మోడల్ గా గుర్తింపు పొందిన ఎలిసానీ తన కల నిజం చేసుకుంటోంది. ప్రపంచ పొడవైన మోడల్, బ్రెజిల్ టాల్ సుందరి ఎలీసానీ సిల్వా డిక్రూజ్ ఆమె ప్రియుడు ఐదడుగుల నాలుగంగుళాల పొడవైన ఫ్రాన్సినాల్డో కార్వాలోని పెళ్లి చేసుకోనుంది. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం సర్వత్ర ఆసక్తి కలిగిస్తోంది.