: విందు భోజనానికి బాబు ఇంటికి చేరుకున్న పవన్ కల్యాణ్
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల మధ్య మైత్రి కుదిరింది. బీజేపీకి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ పొత్తులో భాగంగా టీడీపీ తరపున కూడా ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ ప్రసంగాలను వినేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ బహిరంగ సభలకు హాజరయ్యారు. దీంతో టీడీపీ ఓటింగ్ శాతం పెరిగిందని ఆ పార్టీ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ను మధ్యాహ్న విందు భోజనానికి ఆహ్వానించారు. బాబు ఆహ్వానం మేరకు పవన్ కల్యాణ్ ఆయన నివాసానికి చేరుకున్నారు.