: అత్యాచార ఆరోపణలతో గాయకుడు అంకిత్ తివారీ అరెస్టు


అత్యాచార ఆరోపణలపై బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీని ముంబయిలోని వెర్సోవా పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు అన్న అంకుర్ తివారీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందు తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసిన అంకిత్, తర్వాత చేసుకోనని చెప్పాడంటూ ఓ యువతి(28) పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, నిన్న రాత్రి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి వెళ్లిన అంకిత్ అత్యాచారానికి పాల్పడ్డాడని దాంతో, తమకు కంప్లైంట్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల హిందీలో విజయవంతమైన 'ఆషికి2' చిత్రంలో 'సున్ రహా హే నా' పాటతో అంకిత్ మరింత పాప్యులర్ అయ్యారు.

  • Loading...

More Telugu News