: తీహార్ ఖైదీకి 'తాజ్ మహల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్' లో ఉద్యోగం


ఢిల్లీలోని తీహార్ జైల్లో ఎనిమిదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న రాజు ప్రశాంత్ అనే యువకుడు తాజ్ మహల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో ఉద్యోగం సంపాదించాడు. జైలు లోపల నిన్న (బుధవారం) నిర్వహించిన ప్రైవేటు కంపెనీల రిక్రూట్ మెంట్ లో తాజ్ లో అసిస్టెంట్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ గా సెలక్ట్ అయ్యాడు. నెలకు రూ.35వేల జీతాన్ని ప్రశాంత్ కు ఆఫర్ చేశారు. ఓ నేరంలో శిక్షపడ్డ అతను జైల్లోనే ఇగ్నో యూనివర్శిటీ ద్వారా దూరవిద్యలో 'బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్' లో డిగ్రీ పూర్తి చేశాడు.

ఈ సందర్భంగా ప్రశాంత్ స్పందిస్తూ, ఓ హత్య కేసులో శిక్ష పడటంతో తాను ఇక్కడికి వచ్చానని, సత్ప్రవర్తన కారణంగా తన శిక్షను తగ్గించారని తెలిపాడు. ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని... తన యజమానులకు న్యాయం చేస్తానని చెప్పాడు. కాగా, ఈ రిక్రూట్ మెంట్ లో మరో 65 మంది ఖైదీలు కూడా ఉద్యోగాలు సంపాదించారు. వీరంతా త్వరలో తమ జాబ్ లలో చేరనున్నారు.

  • Loading...

More Telugu News