: కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారానికి 16 రోజులు ఆగాల్సిందే


రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కానీ, కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయడానికి మరో 16 రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే, అపాయింటెడ్ డే జూన్ రెండు కాబట్టి... విభజనానంతరం ఏర్పడే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రోజున ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

"కొత్త ముఖ్యమంత్రులిద్దరూ జూన్ రెండో తేదీని మంచి రోజుగా భావించిన పక్షంలో అదే రోజున ప్రమాణ స్వీకారం చేయవచ్చు. లేదా జూన్ రెండో తేదీ తర్వాత వారికి వీలైన రోజున చేయవచ్చు" అని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా గవర్నర్ నరసింహన్ విభజన పనులకు గడువు తేదీని మే 15వ తేదీగా విధించారు.

  • Loading...

More Telugu News