: సూరవరపుపల్లెలో రాత్రంతా కాల్పులు...బిక్కుబిక్కు మంటూ గడిపిన ప్రజలు
ప్రకాశం జిల్లా యుద్ధనపూడి మండలం సూరవరపుపల్లెలో యుద్ధం జరిగింది. టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడులు, ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో గ్రామం మొత్తం కంటి మీద కునుకన్నది లేకుండా గడిపింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ దాడులు ఆగలేదు. రాత్రంతా పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతూనే ఉన్నారు. గ్రామస్థులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని రాత్రంతా గడిపారు.