: పోలీస్ స్టేషన్ ఎదుట చింతమనేని ప్రభాకర్ ధర్నా
ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధర్నా చేస్తున్నారు. నిన్న పోలింగ్ సందర్భంగా రామన్నపాలెంలో ఘర్షణ చెలరేగినప్పుడు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ తన నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో అరెస్టు చేసిన ఏడుగురు టీడీపీ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.