: జ్యోతిష్యులకు భలే గిరాకీ


ఎన్నికల నేపథ్యంలో జ్యోతిష్యులకు భలే గిరాకీ పెరిగింది. ఎన్నికలు ముగిసి ఓట్ల లెక్కింపుకు వారం రోజుల గడువు ఉండడంతో అభ్యర్థులు గెలుస్తామో లేదోననే ఆందోళనలో పడిపోయారు. వారి ఆందోళన పోగొట్టుకునేందుకు జ్యోతిష్యుల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. వారితో పాటు బెట్టింగ్ బంగార్రాజులు కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కాస్తూ అభ్యర్థుల రాశిఫలాలు పట్టుకుని తమ అభ్యర్థికి గెలిచే యోగం ఉందా? లేదా? తమకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందా? లేదా? అంటూ పంచాంగకర్తల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో జ్యోతిష్యులు 'భలే మంచి చౌక బేరము... ఇది సమయము మించినన్ దొరకదు' అంటూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News