: ప్రభుత్వ బంగ్లాల్లోనే మాజీ మినిస్టర్లు!


తమ పదవీకాలం ముగిసినా దాదాపు ఇరవై రెండు మంది మాజీ మంత్రులు కేంద్ర ప్రభుత్వ సౌకర్యాలతో రాజభోగం అనుభవిస్తున్నారు. వారంతా యూపీఏ-2కు చెందిన మంత్రులు కావడం గమనార్హం. ఢిల్లీలోని లుట్యెన్స్ లో లగ్జరీ బంగ్లాలన్నీ వారితోనే నిండిపోయాయని సమాచార హక్కు కింద అడిగిన వివరాలలో తేలింది. దయానిధి మారన్, ముకుల్ రాయ్, ఎస్ ఎం కృష్ణ, దినేష్ త్రివేది, సుబోధ్ కాంత్ సహాయ్, పవన్ కుమార్ బన్సల్, హరీష్ రావత్ తదితరులు ఉన్నారు.

మొన్నటివరకు పదవిలో ఉన్న వీరంతా మాజీలైన తర్వాత కూడా అదే ఇళ్లలో కొనసాగనున్నారు. వీరంతా కాక సీనియర్ నేత బూటా సింగ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లు ఇప్పుడు తాముంటున్న ఇళ్లకు ప్రత్యేక రాయితీతో అతి తక్కువ అద్దెను చెల్లిస్తున్నారట. అంతేగాక టెర్రరిస్టుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రమాదం ఉందని, రక్షణ కల్పించాలంటూ కొన్నాళ్ల కిందట ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు బూటా విజ్ఞప్తి చేశారు. దాంతో, ఆయన రెకమెండేషన్ తో బూటా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని అనుభవిస్తున్నారని తెలిసింది.

  • Loading...

More Telugu News