: మగాళ్లకు అందగత్తెలు నచ్చరట
తరాలు మారినా మగాళ్ల ఆలోచనల్లో మార్పు రాలేదంటారు మహిళా సంస్కర్తలు. మిగిలిన విషయాల సంగతి ఏమో తెలియదు కానీ... ఆడవారి అందం విషయంలో మాత్రం మగవాళ్ల ఆలోచనలు మారలేదని పరిశోధనలు నిరూపించాయి. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉన్నా ఇంచుమించు అందరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయని ఆ పరిశోధనలు వెల్లడించాయి. మగవాళ్లు సరైన కొలతలతో తీర్చిదిద్దిన అందంతో ఉండే ఆడవారిని కోరుకోరని, చారడేసి కళ్లు, తీరైన పెదాలు, చక్కని చెక్కిళ్లు ఉన్న అమ్మాయిలను బాగా ఇష్టపడతారని పరిశోధనలు తెలిపాయి. మొత్తం 28 దేశాల్లోని మగవాళ్ల ఆలోచనలు, ఇష్టాలను పరిశీలించిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.