: బాషా ఒక్కసారి చెబితే... ‘3 లక్షల’ సార్లు చెప్పినట్టే!


బాషా ఒక్కసారి చెబితే, 3 లక్షల సార్లు చెప్పినట్టే... అవును మరి! రజనీకాంత్ ట్విట్టర్ ఖాతాను ప్రారంభించి కొద్ది రోజులే అయినప్పటికీ... సూపర్ స్టార్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య మాత్రం 3 లక్షలు దాటిపోయింది. రజనీ ట్విట్టర్ ఖాతాను 3.13 లక్షల మంది అనుసరిస్తున్నారు. అయితే, రజనీ ఇలా కొత్త ట్విట్టర్ ఖాతా తెరుస్తున్నారని తెలిసిన వెంటనే.. ఆయన పేరు మీద నకిలీ ఖాతాలు కూడా తెరవడం మొదలుపెట్టారు. అయితే, ఆయన అభిమానులు మాత్రం అసలు సిసలైన సూపర్ స్టార్ ట్వీట్లను లక్షల్లో ఫాలో అవుతుండగా.. నకిలీ ఖాతాలకు ఫాలోయర్లు వందల్లోనే ఉన్నారు. కొచ్చడయాన్ సినిమా విడుదలయ్యాక ఈ ఫాలోయర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News