: విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరిన విజయమ్మ
వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. విశాఖ లోక్ సభ బరిలో ఉన్న ఆమె నిన్న పోలింగ్ సందర్భంగా నగరంలోని పలు బూత్ లను సందర్శించారు. ఓటింగ్ సరళిని గమనించారు. పోలింగ్ అయిపోయిన తర్వాత రాత్రి ఆమె విశాఖలోనే బస చేశారు.