: పవన్ కల్యాణ్ కు చంద్రబాబు విందు
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు మంచి దోస్తులైపోయారు.
టీడీపీ-బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించి, 'వైసీపీ హఠావో, సీమాంధ్ర బచావో' అంటూ నినదించిన పవన్ ని బాబు ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు.
ఎన్నికలు ముగియగానే నిన్న ఆయనకు ఫోన్ చేసి, కృతజ్ఞతలు కూడా తెలిపారు బాబు.
ఈ రోజు ఏకంగా తన ఇంటికి విందుకు ఆహ్వానించారు.
దాంతో పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం చంద్రబాబు ఇంటికి లంచ్ కి వెళుతున్నట్టు సమాచారం.