: విజయమ్మ దీక్షపై వీరశివారెడ్డి శివాలు
వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఇవాళ శివాలెత్తారు. విద్యుత్ ఛార్జీల పెంపు మీద విజయమ్మ చేస్తోన్న దీక్షలో చిత్తశుద్దిలేదన్నారు. కేవలం రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునేందుకే విజయమ్మ ఈ దీక్షకు ఉపక్రమించారని ఆయన అన్నారు. అసలు ఎమ్మెల్యేల నివాస ప్రాంగణంలో విజయమ్మను దీక్షకు ఎలా అంగీకరించారని శివారెడ్డి ప్రశ్నించారు. దీనికి సంబంధించి అసెంబ్లీ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు.