: నలుగురు అక్కాచెల్లెళ్ళపై యాసిడ్ దాడి


ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లాలోని షామ్లీ లో ఘోరం జరిగింది. పాఠశాల నుంచి ఇంటికి వెళుతోన్న నలుగురు అక్కాచెల్లెళ్లమీద ఇద్దరు యువకులు యాసిడ్ చల్లారు.  మోటార్ సైకిల్ పై వెళ్తూ దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. దాడికిగురైన నలుగురిలో ముగ్గురు పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు.  ఈ దాడిలో అందరిలోనూ చిన్నదైన చెల్లెలు తీవ్రంగా గాయపడింది. ఈమెకు ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముఖానికి ముసుగువేసుకుని వచ్చిన యువకులు ఈ దురాగతానికి పాల్పడ్డారని అగంతకులకోసం గాలిస్తున్నామని  పోలీసులు చెప్పారు.  కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News