: సీమాంధ్ర జిల్లాల నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
సీమాంధ్రలో ఎన్నికల సందర్భంగా పోలింగ్ సరళి గురించి వివరాలు తెలుసుకునేందుకు జిల్లాల నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సరళి తమకే అనుకూలంగా ఉందని ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాడులను సమర్థంగా ఎదుర్కోవాలని తమ పార్టీ నేతలకు ఆయన చెప్పారు. 90 శాతం పోలింగ్ జరిగేలా చూడాలని జిల్లా నేతలకు చంద్రబాబు సూచించారు.