: బీసీసీఐ నిషేధాన్ని కోర్టులో సవాల్ చేస్తాం: ఆర్ సీఏ


రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా లలిత్ మోడీని ఎన్నుకోవడంపై ఆగ్రహించిన బీసీసీఐ వెంటనే ఆర్ సీఏ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై జైపూర్ హైకోర్టులో సవాల్ చేస్తామని ఆర్ సీఏ కొత్త కార్యదర్శి సుమేంధ్ర తివారీ తెలిపారు. ఇందుకోసం తమ లాయర్ పేపర్లు సిద్ధం చేస్తున్నారని, త్వరలో వాటిని కోర్టులో సమర్పిస్తామని చెప్పారు. తమ అసోసియేషన్ ను బీసీసీఐ ఆపలేదన్నారు. ఈ మేరకు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కు కొత్తగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ సభ్యులందరూ నిన్న (బుధవారం) లండన్ లో ఉన్న తమ కొత్త అధ్యక్షుడు లలిత్ మోడీతో రెండు గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ కొత్త అసోసియేషన్ భవిష్యత్ ప్రణాళికలపై మోడీ వివరించారు. అయితే, ఐపీఎల్ లాగా త్వరలో 'రాజస్థాన్ ప్రీమియర్ లీగ్' (ఆర్ పీఎల్) ను ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News