: బర్త్ డే వేళ శ్రీవారి చెంత జయప్రద.. త్వరలోనే రాష్ట్ర రాజకీయల్లోకి!


 ప్రముఖ సినీనటి.. ఎంపీ జయప్రద ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆమె వెంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జయప్రద.. నేడు తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టు చెప్పారు. దేశ ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు.  

ఇదిలా ఉండగా, రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేందుకు జయప్రద తహతహలాడుతున్నారు.  పదేళ్ల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేందుకు మళ్లీ మొగ్గుచూపుతున్నారు. అంతేకాదు, తాను ఏ పార్టీలో చేరబోయేది ఈ నెలాఖర్లో ప్రకటిస్తానని ఆమె తిరుమలలో చెప్పారు. ఈ విధంగా మళ్లీ తెలుగు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. సెక్యులర్ విధానాలకు కట్టుబడడంతో పాటు, ప్రజల సమస్యలను పట్టించుకునే పార్టీలోనే చేరాలని నిర్ణయించుకున్నట్టు జయ వెల్లడించారు. నేడు జయప్రద 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News