: తనకు నచ్చిన పార్టీకి ఓటేయలేదని... కట్టుకున్న భార్యనే కాల్చేశాడు!


తనకు నచ్చిన పార్టీకి ఓటేయలేదని కట్టుకున్న భార్యనే కాల్చిపారేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు. ఈ దారుణ ఘటన బీహార్ లోని ఉజియార్ పూర్ నియోజకవర్గంలోని మొయినుద్దీన్ నగర్ లో జరిగింది.

ఉజియార్ పూర్ లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. వినోద్ పాశ్వాన్ అనే వ్యక్తి తన భార్య తన మాట వినకుండా వేరే పార్టీకి ఓటేయడంతో కోపంతో ఊగిపోయాడు. ఆగ్రహంతో తుపాకీతో ఆమెను కాల్చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయడంతో పాశ్వాన్ పరారయ్యాడు.

  • Loading...

More Telugu News