: పాక్ ఎయిర్ పోర్టులో ఎఫ్ బీఐ ఏజెంట్ అరెస్టు
పాకిస్థాన్లోని కరాచీ ఎయిర్ పోర్టులో అమెరికాకు చెందిన ఎఫ్ బీఐ ఏజెంట్ ను రెండు రోజుల (సోమవారం) కిందట పోలీసులు అరెస్టు చేశారు. 9ఎంఎం హాండ్ గన్ లో ఉపయోగించే పదిహేను బుల్లెట్లను అనుమతి లేకుండా తీసుకువెళుతున్నట్లు తనిఖీల్లో బయటపడింది. దాంతో, వెంటనే విమానాశ్రయ అధికారులు ఏజెంటును నిర్బంధించి పోలీసు కస్టడీకి అప్పగించినట్లు ఓ అధికారి తెలిపారు. పాక్ లో అవినీతి కేసు దర్యాప్తు కోసం స్థానిక అధికారులకు సహాయం చేసేందుకు ప్రస్తుతం అతడిని తాత్కాలికంగా ఇక్కడ నియమించినట్లు చెప్పారు. అయితే, బుల్లెట్స్ తీసుకొస్తున్నట్లు అమెరికా ఏజెంట్ ముందస్తుగా చట్టపరమైన అనుమతి తీసుకోలేదని సీనియర్ పోలీసు అధికారి రావ్ అన్వర్ పేర్కొన్నారు.