: అమేథీలో ప్రియాంక పీఆర్వో... స్మృతి ఇరానీ ఫిర్యాదు!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ నియోజకవర్గంలో ఈ మధ్యాహ్నం ప్రియాంక గాంధీ పీఆర్వో ప్రీతి సహాయ్ ప్రత్యక్షమైంది. ఆమెను చూసిన బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ వెంటనే జిల్లా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారి, పోలింగ్ ప్రాంతాన్నీ విడిచి వెళ్లాలని ప్రియాంక పీఆర్వోను ఆదేశించారు. పోలింగ్ బూత్ లోపల ఏ హక్కుతో ప్రియాంక పీఆర్వో ఉందని స్మృతి ఇరానీ మీడియా ఎదుట ప్రశ్నించారు. తన అథారిటీ లెటర్ ను ఆమెను అడిగినప్పుడు బయటికి వెళ్లిందని చెప్పారు. కావాలంటే ఈసీ కెమెరాల్లో చెక్ చేసుకోవచ్చని స్మృతి అన్నారు.