: అమేథీలో కాంగ్రెస్ రిగ్గింగ్ కు పాల్పడుతోంది: బీజేపీ, ఆప్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ లోక్ సభ నియోజకవర్గంలో పలు పోలింగ్ బూత్ లలో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ కు పాల్పడుతోందని బీజేపీ, ఆప్ లు ఆరోపించాయి. కొన్ని పోలింగ్ బూత్ లలో బీజేపీ ఏజెంట్లను కాంగ్రెస్ నేతలు బెదిరించారని బీజేపీ తెలిపింది. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలపై చర్యలు తీసుకోవాలని ఈ రెండు పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశాయి.