: ఎన్ కౌంటర్ కేసులో అమిత్ షాకు క్లీన్ చిట్
ఇష్రత్ జహన్ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ నేత, నరేంద్రమోడీ సన్నిహితుడు అమిత్ షాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు నేడు ఓ నివేదికను ప్రత్యేక సీబీఐ కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఈ కేసులో షాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం లభించలేదని తెలిపింది. దాంతో, దేశ తదుపరి ప్రధానమంత్రి కానున్న మోడీకి పెద్ద ఊరట లభించినట్లైంది. 2004లో గుజరాత్ లోని మోడీ ప్రభుత్వంలో హోంమంత్రిగా అమిత్ షా ఉన్న సమయంలో ఇష్రత్, పలువురు విద్యార్థులపై అహ్మదాబాద్ శివార్లలో బూటకపు ఎన్ కౌంటర్ జరిగింది. దాంతో, ఆయనపై తీవ్ర ఆరోపణలు రావడంతో పలుమార్లు సీబీఐ ప్రశ్నించింది. అదే సమయంలో షా తన పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో కొద్ది రోజుల పాటు జైల్లో ఉన్న షా తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.