: చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు: మోడీ


ఈ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా భావించే అమేథీలోనే పరాజయం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఆహార పదార్థాలను పేద ప్రజలకు పంచడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని మోడీ అన్నారు. అవే ఆహార పదార్థాలను కిలోకు 80 రూపాయల చొప్పున మద్యం తయారీకి అమ్ముకోవడం రాజనీతి అంటారా? అని మోడీ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News