: రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్లలాగుడు పోటీలు ప్రారంభం
ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలంలోని వెలుగొండలో రాష్ట్ర స్థాయి బండ్లలాగుడు పోటీలు ఇవాళ మొదలయ్యాయి. వెలుగొండ క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. జూనియర్ విభాగంలో పోటీలు ఇవాళ, సీనియర్ విభాగంలో పోటీలు రేపు జరుగుతాయి.
ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి ఔత్సాహిక రైతులు తమ ఎడ్లను పోటీల ప్రాంగణానికి తేవడంతో కోలాహల వాతావరణం నెలకొంది. 'పాలపళ్ల సైజు ఎండ్ల బండ్ల పోటీ'లని స్థానికంగా పిలుచుకునే ఈ పోటీలను మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కోఆర్డినేటర్ అనుమారెడ్డి ప్రారంభించారు.