: మీడియాపై దాడి చేసిన వారిని వదిలిపెట్టం: భన్వర్ లాల్
కడప జిల్లా నడవలూరులో మీడియాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఖండించారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటామని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తామని భన్వర్ లాల్ భరోసా ఇచ్చారు.