: ఒకే కాలనీలో మూడు వేల ఓట్ల గల్లంతు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏటిమొగలో కొండబాబు కాలనీకి చెందిన 3 వేల ఓట్లు గల్లంతయ్యాయి. అధికారులతో కుమ్మక్కైన అంగన్ వాడీ కార్యకర్త ఒకరు తమ ఓట్లు గల్లంతు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక బీసీ అభ్యర్థి అయిన మత్స్యకారుడని ఓడించేందుకు కంకణం కట్టుకున్న వైఎస్సార్సీపీ కుట్రపన్ని తమ ఓట్లు గల్లంతు చేయించిందని వారు మండిపడుతున్నారు. దీనిపై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు.