: ఆగస్టు 24వ తేదీన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టు 24న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ప్రతి సంవత్సరం ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈసారి ప్రిలిమనరీ పరీక్షకు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది హాజరవుతారని యూపీఎస్సీ అంచనా వేసింది.