: వారణాసిలో రోటీలపై, లడ్డూలపై కమలం గుర్తులు
వారణాసిలో మోడీ ఫీవర్ పతాక స్థాయికి చేరుకుంది. ఎక్కడ చూసినా మోడీ గుర్తులతో మాస్కులు, బెలూన్లు ఇతర వస్తువులు తెగ దర్శనమిస్తున్నాయి. కొన్ని హోటళ్లలో అయితే రోటీలపై కమలం గుర్తులు అచ్చు గుద్ది మరీ వడ్డిస్తున్నారు. స్వీట్లపై కూడా కమలం గుర్తులే దర్శనమిస్తున్నాయట. అయితే, వీటిని తినడానికి కస్టమర్లు ఏమంత ఆసక్తి చూపడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా క్యాప్ లు, టీషర్టులను పంపిణీ చేస్తోంది. ఇక్కడ నరేంద్రమోడీ, అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 12న చివరి దశ పోలింగ్ రోజు ఇక్కడ ఓటింగ్ జరగనుంది.