: విశ్వరూపాన్ని వీక్షించిన రజనీ కుటుంబం
''కమల్! నీ నటన అద్భుతం. దర్శకత్వం కూడా చాలా బాగా చేసావు. నీకు నా అభినందనలు" ఈ మాటలు ఎవరివో తెలుసా? తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కమల్ హాసన్ ను మెచ్చుకున్న తీరు. విషయం ఏమిటంటే.. కమల్ హాసన్ తన తాజా చిత్రం 'విశ్వరూపం'ను గురువారం రాత్రి రజనీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. చెన్నైలోని పోయస్ గార్డెన్ లో వున్నరజనీ నివాసంలో ఇది జరిగింది.
ఈ సినిమాను చూసిన తర్వాత కమల్ ను రజనీ ప్రశంసలతో ముంచెత్తారు. కమల్, రజనీకాంత్ ప్రియ మిత్రులు అన్న విషయం అందరికీ తెలుసు. విశ్వరూపం చిత్రంపై ముస్లిములు అభ్యంతరం వ్యక్తం చేయడం, తమిళనాడు ప్రభుత్వం దానిపై నిషేధం విధించడం తెలిసిందే. ఆ సమయంలో రజనీ కమల్ కు ఎంతో అండగా నిలిచారు.