: చీపురుపల్లిలో ఈవీఎంలు మొరాయింపు... బొత్స అసంతృప్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంపై కాంగ్రెస్ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎనిమిది చోట్లకు వెళితే ఐదు చోట్ల ఈవీఎంలు మొరాయించాయని, దాంతో ప్రజలు ఓటు వేయకుండా వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. కానీ, ప్రజల్లో ఓటు వేయాలన్న అవగాహన పెరిగిందని బొత్స తెలిపారు.