: ఆ చిన్నారులను నర్సరీలో చేర్చుకోండి: సుప్రీంకోర్టు


ఢిల్లీలో నర్సరీ అడ్మిషన్లపై ఉన్న సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు ఇవాళ ఎత్తివేసింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అంతర్రాష్ట్ర కోటా కింద తమ పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలంటూ చిన్నారుల తల్లిదండ్రులు కొందరు కోర్టుకు వెళ్లగా, వాళ్లు దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లో అడ్మిషన్లు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

ఒకవేళ ఆ 24 మంది పిల్లలకు ఎక్కడా సీట్లు దొరక్కపోతే, ఆయా పాఠశాలల్లో అదనపు సీట్లు సృష్టించి వారిని చేర్చుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఇక్బాల్, జస్టిస్ ఎస్ఏ బోబ్డేలతో కూడిన ధర్మాసనం తన తీర్పును వెలువరించింది.

  • Loading...

More Telugu News