: దాడి చేసిని వారిని అరెస్ట్ చేయాలంటూ ఎస్పీకి భన్వర్ లాల్ ఆదేశాలు
చిత్తూరు జిల్లా నడవలూరులో మీడియాపై దాడిచేసిన నలుగురిని పోలీసులు గుర్తించారని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేశారని... వారిని వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించినట్టు చెప్పారు. మీడియాపై దాడులు చేసినవారు ఆ ఊరికి చెందిన వారే అని అన్నారు.