: రక్షణ కల్పించలేం... ఏదోలా వచ్చేయండి: చిత్తూరు ఎస్పీ
చిత్తూరు జిల్లా నడవలూరులో వైకాపా కార్యకర్తలు జరిపిన దాడిలో పోలింగ్ అధికారితో పాటు మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. రాళ్ల దాడిలో మీడియా వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ వారు దాడులను నిలువరించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో, జరిగిన పరిణామాలను జిల్లా ఎస్పీ రాజశేఖర్ కు మీడియా ప్రతినిధులు ఫోన్ లో వివరించారు. అయితే, రక్షణ కల్పిస్తామని చెప్పాల్సిన ఎస్పీ మాత్రం ఖాకీ డ్రస్సు సిగ్గుతో తలవంచుకునేలా సమాధానం చెప్పారు. మీకు రక్షణ కల్పించలేము... ఏదో ఒకవిధంగా సురక్షిత స్థానానికి చేరుకోండని సలహా ఇచ్చారు.