: మీడియాపై వైకాపా దాడి... వాహనాలు ధ్వంసం
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. నడవలూరు గ్రామంలో పోలింగ్ అధికారిపై దాడి చేసి... ఏకపక్షంగా ఓటింగ్ జరుపుకునేందుకు ప్రయత్నించారు. వైకాపా శ్రేణుల దాడికి నిరసనగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ ను నిలిపివేశారు. వైకాపా దౌర్జన్యాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై కూడా దాడి చేశారు. మీడియా ప్రతినిధులపై రాళ్లు రువ్వారు. వైకాపా దాడిలో మీడియా వాహనాలు, ఓబీ వాన్ ధ్వంసమయ్యాయి. ఓ కెమెరా మెన్ కు తీవ్రగాయాలయ్యాయి. వైకాపా దాడులకు నిరసనగా మీడియా ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.