: అమెరికాలో భారతీయుల భార్యలకు భలే చాన్స్
అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే భారతీయులకు సంతోషం కలిగించే నిర్ణయం వెలువడనుంది. హెచ్1బీ వీసా కలిగిన వారి భార్యలు ఇకపై అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఆ అవకాశం లేదు. ఈ ప్రతిబంధకం వల్ల అధిక నైపుణ్యం కలిగిన మానవవనరులు అమెరికాను వీడుతుండడంతో చట్ట నిబంధనలను సవరించాలని అంతర్గత భద్రతా విభాగం ప్రతిపాదించింది. దీనికి అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపితే, ఈ మార్పు అమల్లోకి వస్తుంది.