: అనంతపురం వైకాపా అభ్యర్థి భార్య ఓటు మరెవరో వేసేశారు


ఒకరి ఓటును మరొకరు వేయడం మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. తన ఓటును మరొకరు వేశారంటూ బాధపడిన వారిని కూడా చాలా మందినే చూసి ఉంటాం. ఇప్పుడు అదే అనుభవం ఓ అభ్యర్థి భార్యకు ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, అనంతపురం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి గుర్నాథ్ రెడ్డి తన కుటుంబంతో కలసి ఓటు వేయడానికి 103వ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. కానీ, అప్పటికే తన భార్య ఓటును ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వేసేసి వెళ్లిపోయారు. దీంతో, ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఓటు వేయడానికి వచ్చి క్యూ లైన్లలో నిలబడి ఉన్న ఓటర్లెవరు ఓటు వేయడానికి వీల్లేదని... అందరూ వెళ్లిపోవాలని సూచించారు. మరెవరూ ఓటు వేయకుండా పోలింగ్ బూత్ తలుపు వద్ద అడ్డంగా నిలబడ్డారు. అంతేకాకుండా ఎన్నికల అధికారిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 103వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News