: జోరుగా ఎనిమిదో దశ పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిదో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలతోపాటు, ఆరు రాష్ట్రాల్లోని మరో 39 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది. వీటిలో ఉత్తరప్రదేశ్ లో 15, పశ్చిమబెంగాల్ లో 6, బీహార్ లో 7, ఉత్తరాఖండ్ లో 5, హిమాచల్ ప్రదేశ్ లో 4, జమ్మూ కాశ్మీర్లో 2 స్థానాలు ఉన్నాయి. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులు రాహుల్ గాంధీ (అమేథీ), వరుణ్ గాంధీ (సుల్తాన్ పూర్), మహహ్మద్ కైఫ్ (ఫూల్ పూర్), రబ్రీదేవి (శరణ్)తదితరులు ఉన్నారు.