: మలేషియా పార్లమెంట్ రద్దైంది


మలేషియా పార్లమెంట్ ను ఆ దేశ ప్రధాని ఇవాళ రద్దు చేశారు. ఇందుకు రాజు కూడా అంగీకారం తెలిపారని ప్రధాని నజీబ్ రజాక్ తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతోనే పార్లమెంట్ ను రద్దు చేయాలని ప్రధాని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో మలేషియాలో త్వరలోనే సాధారణ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని సూచికలు ఉండటంతో ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమైంది. 

  • Loading...

More Telugu News